సిరాన్యూస్, ఓదెల
53 ఏండ్లు దాటిన చెక్కు చెదరని మానేరు వంతెన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో.. ఇంజనీర్లు ఎంతో ఆలోచించి, శ్రమించి నిర్మించిన కట్టడాలు కూడా.. చిన్న చిన్న గాలి వానలకే కూలిపోతున్నాయి. నాణ్యతా లోపమో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ కొన్ని నిర్మాణాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. అయితే ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో వంతెనలు వందేళ్లు గడిచినా నేటికీ పటిష్టంగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా మంథని నుండి భూపాలపల్లి వెళ్లే మార్గంలో మానేరు నది పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బహుభాష కోవిదుడు పి.వి. నరసింహారావు 1971 లో మానేర్ నది పై వంతెన నిర్మించారు. వంతెన నిర్మించి 53 సంవత్సరాలు గడిచిన చెక్కుచెదకుండా దర్శనమిస్తుంది. అప్పటి కట్టడాలు అద్భుతాలనీ స్థానికులు అంటున్నారు.