సిరా న్యూస్, ఓదెల
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న దళారులు
* సర్కార్ ఖజానాకు భారీ గండి
* ప్రభుత్వ టెండర్ల పేర్లతో లారీలలో ఇసుక తరలింపు
ఓదెల మండలం మడక కనగర్తి గుండ్ల పల్లె గ్రామాలను ఆనుకొని ఉన్న మానేరు నది నుండి ఇసుక తరలిస్తున్నారు. దీంతో మానేరు నది పక్కన ఉన్న వేలాది ఎకరాల పొలాలు ఎండిపోతున్నాయి .మానేరు నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పక్కనున్న రైతులు లబో దిబో అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతే సాగునీరే కాదు తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. రైతే రాజు అంటూ రైతు పండించే పంటకు నీరు లేకపోతే చేతికొచ్చే పంట చేజారిపోతుంది. మానేరు నదిలో ఇసుక తీయడం ఆపేయాలంటూ రైతులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.