సిరాన్యూస్, ఓదెల
ఆదమరిస్తే అంతే సంగతి..
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామానికి అనుకొని ఉన్న మానేరు నదిపై కొద్దిరోజుల క్రితం కంకర మిల్లర్ అదుపు తప్పి మానేరు నదిలో పడిపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదంలో బ్రిడ్జి సైడ్వాల్ కూలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నదిపై మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ఆ స్థలంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నదిపై నుంచి వెళ్లాలంటే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. కనీసం బ్రిడ్జిపై సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేసి వాహనదారులు ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.