సిరా న్యూస్, ఖానాపూర్
ఈ నెల 19న తై బజార్ వేలం
మున్సిపల్ కమిషనర్ మనోహర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తై బజార్ (అంగడి) వేలంపాట 2023- 2024. సంవత్సరానికి గాను ఈనెల 19న వేలం పాట ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి బుధ, ఆదివారాల్లో నిర్వహించే వారసంతతో పాటు రోజువారి సంతలో జరిగే క్రయ విక్రయాలపై పన్నులు వసూలు చేసినందుకు తై బజార్ నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు ఈనెల 18 సాయంత్రం ఐదు గంటల లోగా 2,00000(రెండు లక్షల) డిడి తీసి మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు.