Manohar Reddy: కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం:  మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

సిరా న్యూస్, ఓదెల‌
కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం:  మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
* ఓదెలలో బీఆర్ఎస్ నాయ‌కుల విస్తృత ప్ర‌చారం

ప్రజలకు అందుబాటులో ఉండి, సేవ చేసే వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దామ‌ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, హరిత మిత్ర అవార్డు గ్రహీత దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఓదెల మండలంలోని గురువారం కోలనూర్, ఓదెల, పోత్కపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించారు. గ్రామాల్లోని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ని గెలిపించాలని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందు బాటులో ఉండే వ్యక్తి కావాలి కానీ దూరంగా ఉండే నాయకులు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేసి ఆరు గ్యారంటీ ల పేరు చెప్పి గద్దె నెక్కిన కాంగ్రెస్ పార్టీ కి పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు.అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, మహిళా నాయకురాలు దాసరి ఉష, కోపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మేడగోని శ్రీకాంత్, తాజా మాజీ సర్పంచ్ గుండేటి మధు, మహేందర్ రెడ్డి, నాయకులు బండారి ఐలయ్య, ఓదెల నరేందర్, సంపత్ రెడ్డి, మద్దెల శ్రీను, మద్దెల నర్సయ్య, పోతర్ల శ్రీనివాస్ ,పోలోజు రమేష్, డాక్టర్ కనికిరెడ్డి సతీష్, తాజా మాజీ, ఉప సర్పంచ్ తీర్తాల కుమారస్వామి, మాజీ ఎంపీపీ బుద్దే రామస్వామి..బోడకుంట నరేష్, చింతం మోగిళి, చింతం వెంకటస్వామి, బుద్దె పోచెట్టి, బోడకుంట మహేందర్, రాచర్ల కుమార్, మార్క రవి,ఐలయ్య, సూత్రాల శ్రావణ్ కుమార్, శ్యామ్, పడాల మల్లయ్య, బోయ సదానందం ,అజార్, మీర్జా ఆలీ, మధుసూదన్ రెడ్డి, శివారెడ్డి, రాసాల అశోక్, యూసుఫ్, వినయ్, అజయ్, పవన్ ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *