శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు

-అందరికీ అండగా ఉంటాం

-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్

సిరా న్యూస్,మంథని;
ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదరించి అత్యధిక మెజారిటీతో 5వ సారి ఎమ్మెల్యేగా గెలిపించిన మంథని మండల ప్రజలకు, నాయకులకు,కార్యకర్తలకు,కాంగ్రెస్ పార్టీ అభిమానులకు.అన్ని అనుబంధాల సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నమని కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మంథని ఎంపీపీ కొండా శంకర్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంథని మండలంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు ని భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించడంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు,నాయకులకు తోడు ఉంటామన్నారు. మన మంథని మండలం లో 4786 మెజారిటీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ ఎల్లప్పుడూ కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మంథని అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్, మండల, పట్టణ ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, కుడుదుల వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య ,మంథని టౌన్ అధ్యక్షులు పొలు శివ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,, వైస్ ఎంపీపీ స్వరూప్ రెడ్డి,ఎంపిటిసిలు ప్రభాకర్ రెడ్డి, రాజయ్య , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ లు పాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *