-విచారణలో వెలుగుచూసిన వేధింపులు, ఆర్థిక నేరాలు
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి;
మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయ మండల పంచాయతి అధికారి మొహమ్మద్ ఆరిఫ్ హుస్సేనుపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మంగళవారం వేటు వేశారు. ఆరిఫ్ ను విధుల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయిమెంట్ హైదరాబాదు కార్యాలయానికి సరెండర్ చేశారు. ఏడాదికాలంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, క్రిందిస్థాయి ఉద్యోగులను ఎంపివో వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఉద్యోగులు ఇటీవల జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద నిరసన చేపట్టి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ విచారణ అధికారిగా జడ్పీ సీఈవోను నియమించి నివేధిక సమర్పించవలసినది ఆదేశించారు. జడ్పి సీఈఓ విచారణలో ఆరిఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. మహిళా పంచాయతి కార్యదర్శుల పట్ల అనుచితంగా వ్యవహరించడం, వేధించడం, అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడటం, విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం, ఆర్థిక దోపిడికి సహకరించాలంటు ఉద్యోగులను భయాందోళనల్కు గురిచేయడం, ఉద్యోగులను వ్యక్తిగత డ్రైవర్లుగా వాడుకోవడం, ఉద్యోగుల కుటుంబ సభ్యులను అవమానిచడం వంటి అనేక అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు విచారణలో తేలడంతో ఏంపివో విధులకు ఆరిఫ్ పనికిరాడంటూ నివేధికలు కలెక్టరుకు సమర్పించారు. ఆరిఫ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టరు అతడిని విధుల నుండి తప్పించారు.
=======================