సిరా న్యూస్,మంథని;
జాతీయ కరాటే పోటీలకు మంథని షిటోరియు కరాటే విద్యార్థులు హర్యానా బయలుదేరి వెళ్లారు. జూలై 14న కరీంనగర్లో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు, జాతీయస్థాయి ఎంపికలు జరిగినవి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో శిక్షకులు, కాయ్ రిఫ్రి కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన జపాన్ షిటోరియు కరాటే అకాడమీ విద్యార్థులు 16, 17 ఇయర్స్ 66 కేజీ గర్ల్స్ కుమితి విభాగంలో మెట్టు హాసిని, 10 ,11 ఇయర్స్ బాయ్స్ కుమితి విభాగంలో బండారి మణికంఠలు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్స్ సాధించి హర్యానాలోని పంచకుల ఒలంపిక్ భవన్లో ఈనెల 16, 17, 18, 19 తేదీలలో జరగబోయే జాతీయ కరాటే పోటీలకు ఎంపికైయ్యారు.జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులను జపాన్ సిటీ కరాటే అకాడమీ జాతీయ ఉపాధ్యక్షులు పాలకుర్తి పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి బి నరేందర్, కోశాధికారి సాయికుమార్, ఇన్స్ట్రక్టర్స్ నాగల్లీ రాకేష్ శివాని లు అభినందించారు.