సిరా న్యూస్,మంథని ప్రతినిధి;
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మంథని ‘షోటొఖాన్ కరాటే విద్యార్తులు అత్యంత ప్రతిభ చాటారు. కరీంనగర్ లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మంథని పట్టణానికి చెందిన జపాన్ కరాటే అసోసియేషన్, షోటొఖాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇనిస్ట్రక్టర్ కోoడ్ర నాగరాజు ఆధ్వర్యంలో 17 మంది విద్యార్థులు పాల్గొని అత్యధిక ప్రతిభ ను కనబరచి మెడల్స్ సాధించి ఓవరాల్ ఛాంపిషన్ షిప్ ని గెలుపొందారు.
బ్లాక్ బెల్ట్ కటా విభాగం లో బొడ్డేళ్ల ఇంద్రాణి గోల్డ్ మెడల్, బేర ఆదిత్య తేజ సిల్వర్ మెడల్, వడ్లకొండ శ్రీవిన్య బ్రాంజ్ మెడల్ అల్ కలర్ బెల్ట్ కటా, కుమితే విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు కుంట సాయి ప్రణవి, హాసిని కుమితే గోల్డ్ కటా సిల్వర్ , శ్రావ్య, శాంతి ప్రియా, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు రాగుల సహస్ర (కుమితే) సిల్వర్ (కటా) బ్రాంజ్ , అన్షు (కుమితే) (కటా) సిల్వర్ , ఆరావ్ (కటా), రాఘవ (కటా ), బ్రాంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు ఐశ్వర్య (కుమితే) (కటా) బ్రాంజ్, భావన (కుమితే) (కటా) బ్రాంజ్, వేదన్ష్, స్మ్రీతిమన్, సాహితి, స్వరమై,పోటీలలో గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులను జే.కె. ఏ సౌత్ జోన్ ఇంఛార్జి రాపోలు సుదర్శన్, షోటోఖాన్ కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య , సీనియర్ కరాటే మాస్టర్లు పర్శ బక్కయ్య, శంకర్ గౌడ్ లు అభినందించారు.
============================