సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రెండు రోడ్డు ప్రమాదాల్లో లారీ,కారు ఢీకొని పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి.వైరా నుండి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని ఖమ్మం వైపు వెళ్తున్న కారు వెనక వైపు నుండి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి అదే ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న పాదచారుని లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో పాదాచారునికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వ్యక్తులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు..