సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని శనివారం మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మున్సిపల్ సమావేశం మందిరంలో నిర్వహించారు. సమావేశంలో పాలక మండల సభ్యులు పాల్గొని పలు అంశాలకు సంబంధించి తీర్మానాలు చేసి ఆమోదం తెలియజేశారు ఈ వర్షా కాలం దృశ్య ఆగస్టు-2024 నెలకు గాను సానిటేషన్ నిర్వహణ కొరకు ప్రైవేట్ లేబర్స్ ను ఎంగేజ్ చేసుకోవడం గురించి తీర్మానించారు.
వీధి కుక్కల నివారణ మరియు రేబీస్ వ్యాధి నుండి రక్షణలో భాగంగా సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు, రేబీస్ వ్యాక్సిన్ చేపించుట గురించి, ఓపెన్ జిమ్ వద్ద పిల్లలు ఆడుకోవడం కొరకు పార్కును ఏర్పాటు చేయుటకు,
మొదలగు అవసరమగు అంశాలను పాలకవర్గ సభ్యులతో చర్చించి ఆమోదం తీసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛధనం – పచ్చదనం అవగాహన కార్యక్రమము వార్డ్ ఆఫీసర్, మెప్మా ఆర్పిస్, ఆశ వర్కర్, అంగన్వాడి టీచర్స్ లతో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ అధ్యక్షతన కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి గారు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య , వార్డు కౌన్సిలర్లు గుండా విజయ లక్ష్మి – పాపారావు, అరేపల్లి కుమార్, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర – శంకర్,గర్రెపల్లి సత్యనారాయణ, కొట్టే పద్మ – రమేష్, చొప్పకట్ల హనుమంతరావు,వి.కే రవి, వేముల లక్ష్మి – సమ్మయ్య లు పాల్గోన్నారు.