సిరా న్యూస్,దంతేవాడ;
ఛత్తీస్ గడ్ రాష్ట్రం దంతెవాడలో చిందనార్-తుమ్రిగుండ రహదారిని మావోయిస్టులు దిగ్బంధించారు. ఛింద్నార్ క్యాంపు నుంచి పహుర్నార్ చౌక్, ఛోటే కర్కా, చెర్పాల్, తుమ్రిగుండ వరకు పలు చోట్ల మావోయిస్టులు రాళ్లు, బ్యానర్ పోస్టర్లు వేసారు. రోడ్డును దిగ్బంధించారు. రోడ్డుపై రాళ్లు, నేమ్ ప్లేట్లతో దిగ్బంధం చేసారు. బర్సూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిద్నార్ సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల బృందం రోడ్డును పునరుద్ధరించే పనిలో నిమగ్నం అయ్యారు.