సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ గడ్ రాష్ట్రం కొండగావ్ జిల్లా ధనోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్లు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో ఓ గ్రామస్థుడిని హత్య చేశారు. నక్సలైట్లు గ్రామస్థుడి ఇంట్లోకి ప్రవేశించి కాల్చి చంపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించింది.
===