పది మంది డీఆర్జీ జవాన్ల హిట్ లిస్ట్ జాబితాను విడుదల చేసిన మావోయిస్టులు

బీజాపూర్లోని భైరామ్ఘడ్ ప్రాంతంలో చెట్లకు పోస్టర్లు అంటించిన మావోయిస్టులు
సిరా న్యూస్,బీజూపూర్;
పదిమంది డీఆర్జీ పోలీసుల హిట్ లిస్ట్ జాబితాను మావోయిస్టులు పోస్టర్ల లేఖ ద్వారా విడుదల చేసారు. అమాయక గ్రామస్తులను, కూలీలను కూడా పోలీసులు బెదిరించినట్లు మావోయిస్టులు ఆ పోస్టర్ లలో పేర్కొన్నారు. బైరoగడ్ లో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేసి, ఎవరి ఇళ్లకు వాళ్లు సురక్షితంగా వెళ్లిపోవాలని లేదా తగు చర్యలు తప్పవని సిపిఐ మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ప్రభుత్వ భవనాల గోడలపై మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యతిరేక నినాదాలు రాసారు. చెట్లకు కరపత్రాలు అతికించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో మావోయిస్టులు ప్రభుత్వ భవనాల గోడలపై త్రివర్ణ పతాకాలలో నల్ల రంగుతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదాలు రాసారు .
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *