చదువు కంటే పెళ్లిళ్లకే ప్రిఫరెన్స్

సిరా న్యూస్;

మన దేశంలో చాలా మంది చదువుకన్నా పెళ్లిళ్లకే రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. వివాహం జీవితంలో ముఖ్యమైన ఘట్టమే. కానీ, కొంతకాలంగా దీనికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి మొదలు కుని పెళ్లి తర్వాత జరిగే వివిధ కార్యక్రమాల వరకు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెడుతున్నారు. మేరకు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ తమ సర్వేలో గుర్తించింది. భారత వివాహ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేసింది. ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లి ఖర్చే ఎక్కువగా చేస్తున్నట్లు జెఫరీస్‌ వెల్లడించింది.భారత మార్కెట్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతాయని సర్వే సంస్థ అంచనా వేసింది. చైనాలో 70 లక్షల నుంచి 80 లక్షల పెళ్లిళ్లు, అమెరికాలో 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతాయని జెఫరీస్‌ సంస్థ వివరించింది. అమెరికాతో పోలిస్తే భారత వివాహ పరిశ్రమ రెండింతలు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. వివాహాలను ప్రత్యేక రీటైల్‌ కేటరిరీలుగా వర్గీకరిస్తే.. ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద విభాగంగా ఇదే ఉంటుందని వెల్లడించింది.మన దేశంలో వివాహాలను ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తారు. సంస్కృతి, సంప్రదాయాల పేరిట వివిధ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇటీవల ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్‌తోపాటు అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. దుస్తులు, ఆభరణాల వంటి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకూ భారీగా ఖర్చు చేస్తున్నారు. చాలా మంది పెళ్లిని ప్రతిష్టాత్మకంగా భావించి తమ తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారని జెఫరీస్‌ నివేదిక వెల్లడించింది.భారత దేశంలో సగటున ఒక పెళ్లికి రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఆర్థిక స్తోమతను బట్టి ఈ ఖర్చు ఇంకా పెరుగతుందని పేర్కొంది. ఒక్కో పెళ్లికి చదువు కన్నా రెండింతలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికాలో విద్యకు చేసే ఖర్చుతో పోలిస్తే.. పెళ్లికి చేసే ఖర్చు అందులో సగమేనని తెలిపింది.ఇక అంతర్జాతీయంగా పోలిస్తే భారతీయ వివాహాలకు ఖరీదైన ప్రదేశాలు వేదికగా, అతిథులకు మర్యాదలు, పసందైన వంటకాలు, ఆడంబరాలు జరుగుతాయని జెఫరీస్‌ నివేదిక తెలిపింది. దుస్తులు, ఆభరణాలు, ఆతిథ్యం, క్యాటరింగ్, రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పంజుకుంటాయని పేర్కొంది. దేశంలో ఏటా కొనుగోలు చేసే ఆభరణాల్లో సంగం పెళ్లిళ్ల కోసమే చేస్తారని తెలిపింది. దుస్తుల అమ్మకాల్లో 10 శాతం వివాహాలకే వివాహాలే అని పేర్కొంది. పెళ్లి కోసం ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారని గరిష్టంగా 50 వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారని తెలిపింది.
బడ్జెట్ నిర్వహణతో పాటు, అత్యవసర నిధులను సృష్టించడం కూడా ముఖ్యం. వార్షిక ప్రాతిపదికన భారత్‌లో సుమారు 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని చెప్పిన జెఫరీస్.. చైనాలో ఈ సంఖ్య 70 నుంచి 80 లక్షల వరకు ఉందని.. యూఎస్ఏలో ఇది 20 నుంచి 25 లక్షల వరకు ఉందని వివరించింది. ఇక్కడే మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాలో పెళ్లిళ్ల కోసం 70 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తుండగా.. అక్కడితో చూసినా మన దేశంలో దాదాపు రెట్టింపు ఖర్చు చేస్తున్నారని వివరించింది.ఇక జెఫరీస్ రిపోర్ట్ ప్రకారం.. భారత్ కంటే చైనాలో మాత్రం వివాహాల కోసం అధికంగానే ఖర్చు చేస్తున్నారట. చైనాలో ఇది ఏడాదిలో సగటున 170 బిలియన్ డాలర్ల వరకు ఉంది. మన దేశంలో ప్రస్తుతం ఒక అంచనా ప్రకారం.. ఆహారం సహా నిత్యవసరాల కోసం ఏటా రూ. 56.52 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. తర్వాత వివాహ పరిశ్రమే రెండో స్థానంలో ఉంది.ఉదాహరణకు.. కష్ట సమయాల్లో మీ వద్ద డబ్బు లేదని అనుకుందాం.. అప్పుడు మీరు దీని కోసం అత్యవసర డబ్బును ఉపయోగించవచ్చు. మీరు అత్యవసర నిధిని మీ బ్యాంక్ ఖాతాలో లేదా మ్యూచువల్ ఫండ్, లిక్విడ్ స్కీమ్‌లో ఉంచుకోవచ్చు.. తద్వారా అత్యవసర సమయాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు..భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే, ఖర్చుల నిర్వహణకు కొన్ని వస్తువులను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, ఎటువంటి కారణం లేకుండా చేసే ప్రతి నెలా షాపింగ్ ను వాయిదా వేయవచ్చు. అలాగే.. డిన్నర్, పార్టీలు, వీకెండ్ ఎంజాయ్మెంట్ ఇలాంటి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా, మీరు మీ బడ్జెట్‌ను సులభంగా నిర్వహించుకోవచ్చు..ఇంటి నుంచి పదే పదే కిరాణా సామాను ఆర్డర్ చేసే బదులు, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక్కసారే ఆర్డర్ చేసుకోవడం మంచిది. దీనితో మీరు కొన్ని వస్తువులను చౌకగా కొనుగోలు చేయవచ్చు. నెల ప్రారంభం కావడానికి ముందే మీరు జాబితాను సిద్ధం చేసుకుని ఓ ప్రణాళికతో ఖర్చు చేస్తే.. పెరిగిపోతున్న వ్యయాలను నియంత్రించుకోవచ్చు..బడ్జెట్‌ను నిర్వహించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, ఖర్చు ఆదాయంలో 80 శాతం ఉండాలి. కనీసం 20 శాతం పొదుపు చేయాలి లేదా పెట్టుబడి పెట్టాలి. అలాగే, అనవసర ఖర్చులను, అససరం లేని వస్తువుల కొనుగోలును నివారించండి. తరచూ మాల్ లేదా షాప్‌లను సందర్శిస్తూ.. ఇష్టపడిన వాటిని వెంటనే కొనుగోలు చేయాలని అనుకోకండి.. ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు పెరుగుతాయి.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *