పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో ముసుగు దొంగ కలకలం

సిసి కెమెరాలో రికార్డు అయిన ముసుగు దొంగ దాడి యత్నం

విచారణ చేపట్టిన మంథని పోలీసులు

సిరా న్యూస్,పెద్దపల్లి;
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ముసుగు దొంగ హల్ చల్ చేశాడు. గ్రామ ప్రధాన కూడలి సమీపంలో ఓ మహిళ మినీ ఏటీఎం నిర్వహిస్తోంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ముసుగు ధరించిన ఓ వ్యక్తి వచ్చి, కత్తితో ఆమెపై దాడికి యత్నిస్తూ, డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు. బాధితురాలు అక్కడున్న కుర్చీని అతనిపై విసిరేసింది. కేకలు వేయడంతో స్థానికులు చేరుకొని, ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, అతను చెరువు కట్ట వైపు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. సిసి ఫుటేజ్ ఆదారంగా ముసుగు దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *