సిరా న్యూస్,హిందూపురం;
హిందూపురం లో ఉన్న ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ బట్ట బయాలయింది. ఎస్కే యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా సాగుతుంది. యదేచ్చగా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న చూసి చూసినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు పలు ఆరోపణలకు తావిస్తోంది. కాలేజీ ఆవరణంలో ఎక్కడ చూసినా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన జవాబులు…మైక్రో జిరాక్స్ పేపర్లు దర్శనం ఇస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం డీల్ చేసుకుని మరి మాస్ కాఫీ కి పాల్పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నప్పటికీ అబ్జర్వర్లు చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు కూడా వస్తున్నాయి.