స్వచ్చంధంగా విరాళాలివ్వండి
ఎమ్మెల్యే పద్మావతి
సిరా న్యూస్,కోదాడ;
కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ వ్యాప్తగా భారీ నష్టం జరిగింది. గొండ్రియాల, కూచూపుడి, చనుపల్లి, ష్టపురం,కొత్తగూడెం,రెడ్లకుంట,తోగార్రాయి,కోదాడ పట్టణంలో అత్యధికంగా నష్టం జరిగింది. నడిగూడెం మండలంలో నాగార్జున సాగర్ కాలవ తెగిపోయి పంట నష్టం జరిగింది,నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకుంటుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరాళాల ఇవ్వండని కోరారు.
నగదు రూపంలో కాకపోయినా ధాన్యం,దుస్తులు ఇతరతర రూపంలో విరాళాలు ఇవ్వండి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని పునఃరావస కేంద్రాలుగా నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోండి. నియోజకవర్గ వ్యాప్తంగా హెల్ప్ సెంట్రలను ఏర్పాటు చేయడం చేశాం. నారాయణపురం గ్రామంలో చెరువు తెగిపోవడం వల్ల పునఃరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చేశామని అన్నారు. వరద బాధితులకు మూడు పుట్టల భోజనం ప్రభుత్వమే అందిస్తుంది. ప్రతిగ్రామంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ అధికారులు ఇప్పుడు అప్పుడే పంట నష్టం అంచనా వేయలేకపోయారు. పెద్ద చెరువు లో అంత చెత్తాచెదారం పెరుకుపోయిందగి వెంటనే చెత్తాచెదారం తొలిగించాలని అధికారులను అదేశిస్తున్నానని అన్నారు.