సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి అభ్యర్థి పులివర్థి నాని టిడిపి ,బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిన్నారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ మంగళం ప్రాంతంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అవినీతిని ఎండగడుతూ, తనను గెలిపిస్తే అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ, పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశములో మంగళంలోని ప్రజలు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి భారీగా చేరారు.