Massive fire in saw mill : సా మిల్ లో భారీ అగ్ని ప్రమాదం

సిరా న్యూస్, జగిత్యాల;
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది కోరుట్ల పట్టణంలోని గడిబురుజు వద్ద సుఫియా అనే కట్టే మిషన్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, చుట్టుపక్కల వాళ్ళు గమనించి చేరుకునే లోపు కట్ట మిషన్ లో ఉన్న విలువైన వస్తువులు కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. ఎప్పటిలాగే రాత్రి 11 గంటల సమయంలో సామెల్కు తాళం వేసి వెళ్లారు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందో లేక ప్రమాదవశాత్తు నిప్పంటుకుందో తెలియదు కానీ భారీగా మంటలు చెడరేగడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. టేకు కర్ర అలాగే విలువైన సామాగ్రి ఉండడంతో అవి పూర్తిగా కాలిపోయాయి, ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సామిల్ కు మంటలు అంటుకోవడంతోపాటు సామిల్ పక్కన ఉన్న రెండు మూడు ఇళ్లలో కూడా మంటలు వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన అక్కడివారు బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *