సిరా న్యూస్,ప్రోద్దుటూరు;
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ఘటనలో అగ్ని మాపక సిబ్బంది ఒకరు సాంబ శివారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆస్పత్రికి తరలించారు.