కోటి యాభై లక్షల ఆస్తి నష్టం.
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ నందు స్కిట్ కళాశాల సమీపంలో వేస్ట్ బాటిల్స్ నిలువ చేసే,స్క్రాప్ గౌడౌన్ ఉదయం 4:30 గంటలకు అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న గోడౌన్ యజమానిగోడౌన్ వద్దకు చేరుకొని సమాచారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కి తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.ప్లాస్టిక్ బాటిల్స్ అగ్నికి ఆహుతి అవడంతోమంటలు అదుపు చేయలేక నాయుడుపేట నుంచి మరో అగ్నిమాపక వాహనాన్ని పిలిపించి మంటలను అదుపు చేశారు.
బాధితుల సమాచారం మేరకు… తము వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ బాటల్స్ ను కొనుగోలు చేసి వాటిని బయట పరిశ్రమలకు అమ్ముతుంటామని, ఈ నేపథ్యంలో దాదాపు కోటి యాభై లక్షల రూపాయల విలువచేసే వేస్ట్బాటిల్స్ ,వ్యర్థ పదార్థాలు గోడౌన్ మరియు 50 లక్షల అగ్నికి ఆహుతి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.