సిరా న్యూస్, ఆదిలాబాద్:
మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
– ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిమ్చిన మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ చేయుత పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం ఆయన ఆదిలాబాద్ పట్టనంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ చేయుత పథకాలను ప్రారంభించారు. ముందుగా ఇతర అధికారులు, నాయకులతో కలిసి ఆరోగ్య శ్రీ చేయూత పథకానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు, విద్యార్థినిలతో కలిసి స్వయంగా బస్సులో ఎక్కి మావల వరకు ప్రయాణించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం మహిళా సాధికారతకు ఎంతగానో దోహాదపడుతుందన్నారు. ఆర్టీసీలో ప్రయాణాలకు మహిళలు రక్షణ కూడ ఉటుందన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లు ఈ పెల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్ కార్డ్ చూపించడం ద్వార ఉచితంగా తెలంగాణ అంతటా ప్రయాణించవచ్చన్నారు. ఆరోగ్య శ్రీ చేయుత పథకం ద్వార పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం జర్గిందన్నారు. అర్హులైన వారంత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీఎంఅండ్‌హెచ్‌వో రాథోడ్ నరేందర్, ఆర్టీవో శ్రీనివాస్, డీఎస్పీ ఉమేందర్, డీఈవో ప్రణీత, ఆర్టీసీ ఆర్‌ఎం సోలేమాన్, డీఎం కల్పన, మున్సిపల్ కమీషనర్ శైలజ, జడ్పిటీసీ గోక గణేస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.