సిరా న్యూస్, ఇంద్రవెల్లి :
రమాబాయి అంబేద్కర్ త్యాగం మరువలేనిది : సోమోరే మాయబాయి
* త్రిరత్న బుద్ధ విహార్ లో రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతి
సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయురాలు రమాబాయి అంబేద్కర్ అని మహామాయ ఉపాసిక సంఘం మండల అధ్యక్షురాలు సోమోరే మాయబాయి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలంలోని మిలిందనగర్ కాలనీలో గల త్రిరత్న బుద్ధ విహార్ లో రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతిని జరుపుకున్నారు. ముందుగా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా మహామాయ ఉపాసిక సంఘం మండల అధ్యక్షురాలు సోమోరే మాయబాయి మాట్లాడారు. దేశ ప్రజల కోసం అంబేద్కర్ చేస్తున్న పోరాటాలకు రమాబాయి మద్దతుగా నిలిచారన్నారు.జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదోడుకులు వచ్చిన అన్ని భరిస్తూ కుటుంబాన్ని పోషించిందని, అంబేద్కర్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి, చివరీ శ్వాస వరకు బడుగు బలహీన వర్గాల ప్రజల మేలుకొరిందన్నారు.ఆ మహనీయురాలు ఈ సమాజం కోసం చేసిన త్యాగం మరువలేనిదన్నారు. ప్రతి మహిళ రమాబాయి అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోని ఆమె చూపిన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి కాంరాజ్, మహామాయా ఉపాసిక సంఘం సభ్యులు ప్రభావతి, మాయావతి, ఉషబాయి, లతబాయి, దళిత సంఘాల నాయకులు రాజవర్ధన్,గౌతం, లక్ష్మణ్, కచ్రుబా, దీపక్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.