సిరా న్యూస్,మేడ్చల్;
ఎల్ బి నగర్ జోన్ కాప్తా చెరువును నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్ల లో అలసత్వం వాగించవద్దని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని వసతులు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొబైల్ టాయిలెట్, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా వసతులు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.