MD Shahbuddin: వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి

సిరాన్యూస్, చిగురుమామిడి
వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి
* మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి షాబుద్దీన్
* కొండాపూర్‌లో కాంగ్రెస్ నాయ‌కులు ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి షాబుద్దీన్ అన్నారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ నమూనా చూపిస్తూ ఈనెల 13వ తారీకు కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్నసంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో ప్రజలకు మేలు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాంతల జైపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు వడియాల సుధాకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, బూర్ల కుమారస్వామి, యాదగిరి, నాగ సాహెబ్ చీకట్ల సది కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *