సిరా న్యూస్, దస్తురాబాద్
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి
* ఎస్సై ఎండి యాసిర్ అరాఫత్
* బాధ్యతల స్వీకరణ
శాంతి భద్రతలకు పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై ఎండి యాసిర్ అరాఫత్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా దస్తురాబాద్ నూతన ఎస్సైగా ఎండి యాసిర్ అరాఫత్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన దిలావర్‌పూర్ నుండి బదిలీ పై దస్తురాబాద్‌కు వచ్చారు. ఇక్కడ పని చేసిన ప్రభాకర్ రెడ్డి నిర్మల్ కి బదిలీ అయ్యారు.