ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమన్వయకర్త బుట్టా రేణుక
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో నూతనంగా సచివాలయం, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, , సమన్వయకర్త బుట్టా రేణుక గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న యూహెచ్సీ భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు కొత్త సెంటర్ల ఏర్పాటు కోసం భవనాలను నిర్మిస్తోంది అని అన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.