సిరా న్యూస్,తుగ్గలి;
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయని పెండేకల్ సచివాలయ కన్వీనర్ అట్లా బసిరెడ్డి తెలియజేశారు.మండలం పరిధిలోనే పెండేకల్ గ్రామంలో శుక్రవారం నిర్వహిస్తున్న రెండో విడత వైయస్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెండేకల్ గ్రామ సచివాలయం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సచివాలయ కన్వీనర్ అట్లా బసిరెడ్డి కోరారు.శుక్రవారం పెండేకల్ గ్రామంలో ఆయన గ్రామస్తులకు వైయస్ జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం గ్రామస్థాయిలో అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ వైద్య శిబిరానికి కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు రావడం జరిగిందని,అలాగే స్థానిక వైద్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన గ్రామస్తులకు వివరించారు.శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి వాటికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.అందువల్ల ఈ అవకాశాన్ని పెండేకల్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లీలావతి, ఎంపీటీసీ పెద్ద రంగన్న,వైద్యాధికారులు ప్రవీణ్ కుమార్, ఇన్చార్జి ఈఓఆర్డి గోపాల్,పంచాయతీ కార్యదర్శి అంకాలప్ప,సచివాలయ సిబ్బంది,వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.