Megapower star ramcharn..మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ సి 16 మూవీ..

సిరా న్యూస్, హైదరాబాద్:

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ సి 16 మూవీ..

షూటింగ్ ప్రారంభం…

మెగా అభిమానులు శుభవార్త  #RC 16 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న మూవీ నేడు అతిరథుల సమక్షంలో పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ పూజా కార్యక్రమం వేడుక ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ శంకర్, డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, బోనీ కపూర్ తోపాటు.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్సీ 16 పూజా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు ఈ చూసి తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో చరణ్, జాన్వీ పక్కపక్కనే ఉన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మళ్లీ ఇప్పుడు చిరు తనయుడు.. శ్రీదేవి తనయ కలిసి చేస్తుండడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ రూపొందిస్తున్న ఈ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జె్ట్ తో ఈ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను వృద్ధి స్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యాకే రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *