కాంగ్రెస్ కు కామధేనువుగా మారిన మెఘా ఇంజనీరింగ్ కంపెనీ

కమిషన్ల కోసం రాష్ట్ర సర్కార్ “మేఘా”కు కొమ్ము కాస్తోంది
మేఘా కంపెనీపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు..ఇప్పుడు మౌనం ఎందుకు..?
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్ ;
;కాంగ్రెస్ కు మెఘా ఇంజనీరింగ్ కంపెనీ కామధేనువుగా మారిందని,కమిషన్ల కోసం రాష్ట్ర సర్కార్ “మేఘా”కు కొమ్ము కాస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.సుంకిశాల ఘటనకు మెఘా సంస్థదే బాధ్యతని చెబుతున్న వాటర్ బోర్డు. మేఘా కంపెనీపై రాష్ట్ర సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ కు, ప్రజలు, ప్రాజెక్టుల కంటే…కమీషన్లపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని విమర్శించారు.మేఘా కంపెనీపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు…..ఇప్పుడు మౌనం ఎందుకు..? మాజీ సీఎం, తాజా సీఎం మధ్యలో మేఘా కలిసి రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారు. మేఘా సంస్థపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. తప్పు జరిగితే కేంద్ర సంస్థ షోకాజ్ ఇచ్చింది, రాష్ట్ర సర్కార్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. మేఘాపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన, పోరాటం చేస్తామని హెచ్చరించారు.కోట్లాది రూపాయాల ప్రజాధనం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర సర్కార్ ఎందుకు వెనకంజ వేస్తోందో అర్థం కావడం లేదని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనకు పూర్తి బాధ్యత నిర్మాణ సంస్ధ మెఘా ఇంజనీరింగ్ కంపెనీదే అని వాటర్ బోర్డు చెప్పున్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఎందుకని ఆ కంపెనీపై చర్యలు తీసుకోకుండా వెనకాడుతోందని అన్నారు.మెఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎందుకు మోఘా కంపెనీని ఉపేక్షిస్తోందని ఏలేటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుంకిశాల ప్రాజెక్టుపై ప్రేమ కంటే దాని ద్వారా వచ్చే కమిషన్లపైనే ఆసక్తి ఎక్కువ. అందుకే ప్రాజెక్టు కాంట్రాక్టరయిన మెఘా కంపెనీ నాసిరకం పనులు చేస్తున్నా, రిటేనింగ్ వాల్ పడిపోయినా. పట్టించుకోకుండా వెనకేసుకు వస్తున్నారు.మెగా ఇంజనీరింగ్ సంస్ధ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు ఆరోపించారు. మరి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పెద్దలు ఎందుకని మెఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టలేదు. కమిషన్లకు ఆశపడి కాంగ్రెస్ సర్కారు మెఘా ఇంజనీరింగ్ సంస్ధను వదిలేయడంతోనే ఇపుడీ సుంకిశాల ప్రమాదం జరిగింది. ముందే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేదేకాదు. ఇంత జరుగుతున్నా…మొన్ననే అమృత్ స్కీములో కేంద్రం ఇచ్చిన నిర్మాణ పనులను కూడా రాష్ట్ర సర్కారు మెఘా ఇంజనీరింగ్ సంస్ధకే కట్టబెట్టింది. ఇపుడు సిఎం సొంత అసెంబ్లీ సెగ్మెంట్ లో కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మెఘా కంపెనీకే ఇచ్చే అవకాశం ఉంది. నాసిరకం పనులు చేస్తున్న మెఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఇంకా నిర్మాణ పనులు ఎందుకు ఇస్తున్నట్టు … కమిషన్ల కోసమే కదా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెసు సర్కారు నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం కాంట్రాక్టర్లకు భోజ్యమైంది. ప్రభుత్వం ఏదైనా పెత్తనం మాత్రం మెఘా కంపెనీదే అవుతోంది. వేల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలవుతోంది. కాంగ్రెసుకు మెఘా ఇంజనీరింగ్ కంపెనీ కామధేనువుగా మారిందని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫండ్ కోసమే ఇపుడు మెఘా కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి వంత పాడుతున్నారు. అందుకే సుంకిశాల ప్రాజెక్టులో నాసిరకం పనులు చేయడంతో పాక్షికంగా ప్రాజెక్టు కూలినప్పటికీ మెఘా కంపెనీపై చర్యలు తీసుకోకుండా సిఎం రేవంత్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారు. తన నిర్లక్ష్య వైఖరితో సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలడానికి కారణమైన నిర్మాణ సంస్ధ మెఘా కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలని,జరిగిన నష్టాన్ని పూర్తిగా మెఘా కంపెనీతోనే భర్తీ చేయించాలి. ఆ మేరకు కంపెనీపై పెనాల్టీ విధించాలని ,క్రిమినల్ నెగ్లిజన్స్ కింద కంపెనీ పెద్దలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనతో పాటు ఇతరత్రా మెఘా కంపెనీ తప్పిదాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని, తక్షణమే మెఘా కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఇటు మెఘా కంపెనీపై అటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *