సిరాన్యూస్, ఆదిలాబాద్
‘ప్రైవేట్’ పుస్తకాల గోదాం సీజ్: ఎంఈవో జయశీల
నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు విక్రయిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి గోదాం ను ఆదిలాబాద్ ఎంఈవో జయశీల సీజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాఠశాలకు సంబంధించి మసూద్ చౌక్ లో ఓ గదిలో పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఎం ఈవోకు సమాచారం ఇవ్వడంతో గోదాంకు తాళం వేసి సీజ్ చేశారు. నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మహేశ్, అక్షయ్, కార్తీక్, విజ్ఞేష్, నిఖిల్, శివతాయి తదితరులున్నారు.