సిరా న్యూస్, బేల
విద్యార్థులు పఠనాసక్తిని పెంపొందించాలి : ఎంఈఓ కోల నర్సింలు
* మోడల్ గ్రంథాలయం ప్రారంభం
ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించాలని ఎంఈఓ కోల నర్సింలు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మోడల్ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో పఠన శక్తిని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.అధునాతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అనుకూలంగా టేబుళ్లు, పుస్తకాలు అమర్చడానికి ర్యాంకులు, అర్థమయ్యే రీతిలో పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయం అని అన్నారు.కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బేబీ తాయి, ప్రధానోపాధ్యాయుడు సదానంద్, సంస్థ ప్రతినిధులు మహేందర్, చంద్రశేఖర్, సి సి ఐ అతుల్, సి ఆర్ పి లు, రాకుండే వెంకన్న, రేణుక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.