సిరా న్యూస్,బేల
బడిబాటను విజయవంతంగా చేయాలి: ఎంఈఓ శ్రీనివాస్
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న బడిబాటను విజయవంతం చేయాలని ఎంఈఓ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రచార బోర్డులతో గ్రామాల్లో ర్యాలీలు , ఇంటింటా ప్రచారం నిర్వహించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు అందుబాటులో వచ్చాయని తల్లిదండ్రులు, పోషకులతో మాట్లాడి చైతన్యం తీసుకొచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఐకెపి ఏపీఎం రాజారెడ్డి, మాట్లాడుతూ ఏకరూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టిస్తున్నామని పాఠశాలలో నా ప్రారంభమయ్యేలోగా చేరవేస్తామని చెప్పారు. అనంతరం ఆర్పి ప్రభాకర్ బడిబాట ప్రణాళిక గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు కోల నర్సింలు, కుర్ర రమేష్, జాడి సుదర్శన్, అంగన్వాడి పర్యవేక్షకురాలు సుజాత, ఎం ఐ ఎస్ మిథున్, సీఆర్పీలు ఆర్.వెంకన్న, విజయ్, ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు పాల్గొన్నారు.