సిరా న్యూస్,విజయవాడ;
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్రం మరో అడుగు ముందుకేసింది. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి విలీనంపై అభిప్రాయాలు సేకరించనుంది. దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 23గా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.బ్యాంకుల విలీనంపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చుల నియంత్రణ కోసం దేశంలోని పలు గ్రామీణ బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దశల వారీగా బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ…నాలుగో దశలో గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టనుంది. ఈ దశలో 43 గ్రామీణ బ్యాంకుల సంఖ్య వీలనం చేసి 28కు తగ్గించనుంది. విలీన ప్రక్రియకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.నాబార్డ్ తో సంప్రదించి గ్రామీణ బ్యాంకుల విలీనంపై బ్లూప్రింట్ తయారు చేయనుంది కేంద్రం. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి అభిప్రాయాలను కేంద్రం తెలుసుకోంది. మూడు దశల బ్యాంకుల విలీనంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ఇప్పుడు వీటి సంఖ్య 28కి చేరనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో సుమారు 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు బ్యాంకులు ఉండగా, ఉత్తర్ ప్రదేశ్ లో 3, పశ్చిమ బెంగాల్ 3, బిహార్ , గుజరాత్, జమ్మూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకలలో రెండేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.గ్రామీణ బ్యాంకులు….గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర పథకాలు అందిస్తున్నాయి. ఆర్ఆర్బీలను 1976లో ఏర్పాటు చేశారు. ఏపీలో ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వంటి ఆర్ఆర్బీలు ఉన్నాయి. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మిగతా మూడు బ్యాంకులు విలీనం కానున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు అందిస్తు్న్నాయి. వీటిని విలీనం చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా చేస్తారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విభాగాన్ని ఇందులో విలీనం చేస్తారు.కేంద్రం ప్రభుత్వం… బ్యాంకుల అధిపతులకు రాసిన లేఖలో… ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వాటిని మరింత ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ఈ విలీనం ఆర్ఆర్బీల కమ్యూనిటీ కనెక్షన్‌లను బలోపేతం చేయడానికి, వాటి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించనది అని పేర్కొంది.1976 ఆర్ఆర్బీ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సేవలను అందిస్తున్నాయి. ఈ చట్టాన్ని 2015లో సవరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్బీలలో 50% వాటాను కలిగి ఉంది. స్పాన్సర్ బ్యాంకులు 35%, రాష్ట్ర ప్రభుత్వాలు 15% వాటా కలిగి ఉన్నాయి.