సిరా న్యూస్, ఓదెల
ఘనంగా మేరుగు సత్యనారాయణ పదవీ విరమణ సభ
* సత్యనారాయణ మరణానంతరం శరీర దానం
పెద్దపల్లి జిల్లా పోస్టల్ సబ్ డివిజన్ లో “మేల్ ఓవర్ సీర్ “గా విధులు నిర్వహిస్తున్న మేరుగు సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం సుల్తానాబాద్ పోస్టల్ కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు.ఈ సభలో ఓదెల గ్రామానికి చెందిన మేరుగు సత్యనారాయణ, జనని దంపతులు వారి మరణానంతరము శరీర దానం చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసి సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారిలకు అందజేశారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న పోస్టల్ ఉద్యోగుల బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై ఇరువురు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఉన్నతాధికారి అరికాల నరేష్ మాట్లాడుతూ మేరుగు సత్యనారాయణ ఉద్యోగంలో ఉన్నంతకాలం విధులను సక్రమంగా నిర్వహిస్తూ,.. అధికారులు, తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి ఉండి, అందరి మన్ననలు పొందిన సహృదయులని కొనియాడారు. అలాగే ఉద్యోగ విరమణ సందర్భంగా శరీర దానానికి దంపతులు ముందుకు రావడం స్పూర్తి దాయకమని ప్రశంసించి, సదాశయ ఫౌండేషన్ వారి అభినందన పత్రము, ఐ.డి కార్డును ఆ ఆదర్శ దంపతులకు అందజేశారు. పదవీ విరమణ సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్న యం.సత్యనారాయణ, జనని దంపతులకు ఫౌండేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, డాక్టర్ భీష్మాచారినేత ,రమేష్ , రామకృష్ణా రెడ్డి,వాసు, చంద్రమౌళి , పృథ్విరాజ్,క్యాతం మల్లేశం,సదానందం జ్యోత్స్నశ్యామ్ సత్యనారాయణ బంధు మిత్రులు పాల్గొని వారి సమాజహిత నిర్ణయానికి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.