Mestri arrested in Foxo case : ఫోక్సో కేసులో మేస్త్రి అరెస్టు

సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో నివాసం ఉంటున్న మేస్త్రి పెద్దిరాజు పై అత్యాచారం కేసు నమోదు అయింది. తన వద్ద కూలీ పనికి వచ్చిన ఓ మహిళతో మేస్త్రి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మహిళలేని సమయంలో ఆమె కూతురు (బాలిక) పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *