సిరా న్యూస్,సికింద్రాబాద్;
మెట్రో రైల్లో రద్దీ కి అనుగుణంగా కోచ్ లను పెంచాలని సీపీఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు… రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో లో ప్రయాణం చేస్తున్నారని, నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రో లో ప్రయనిస్తున్నారని తెలిపారు… రద్దీ పెరిగితే 3 కోచ్ ల నుండి 6 కోచ్ లకు పెంచుతామని L&T అధికారులు గతంలో చెప్పారని… అనుగుణంగా కోచ్ లు పెంచాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు టాయిలెట్స్, పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పార్కింగ్ ఫీజులు రద్దీ చేయాలని డిమాండ్ చేశారు… సిపిఎం నాయకుల నిరసనలతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు