సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ చీడివలస కొండ శిఖర గ్రామం కోదు ఆదివాసి గిరి 22 కుటుంబాలు 120 మంది జనాభా కలిగిన గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు తెల్లవారుజాము ఉదయం4 పురిటి నొప్పులు రావడంతో. ఉదయం 6 గంటలకు 108 ఫోన్ చేయగా ఉదయం ఎనిమిది గంటలకి గ్రామానికి కిలోమీటర్ దూరం వరకు అంబులెన్స్ వచ్చింది. రోడ్డు సౌకర్యం లేదని గర్భిణీ కిల్లో వసంత మూడో కాన్పు గ్రామం నుండి అంబులెన్స్ కు తీసుకెళ్తున్న మార్గ మధ్యలో ఆడబిడ్డ జన్మించింది. అధిక రక్త ప్రసన్న జరగడంతో 108 సిబ్బంది వచ్చి కొంత వైద్య సహాయం చేసి. అంబులెన్స్ వరకు తీసుకువెళ్లారు. అక్కడనుండి హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది.
================xx