సిద్దిపేట లో అర్ధరాత్రి హైడ్రామా

సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేటలో శుక్రవారం అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. 2 లక్షల రుణమాఫీ అయ్యింది..హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలను తీసేయ్యడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. కాంగ్రెస్, బీఆరెస్ కార్యకర్తలు రోడ్డుపైకి అర్ధరాత్రి భారీగా చేరుకున్నారు. పోటాపోటీ నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి కాంగ్రెస్ కార్యకర్తలు చోచ్చుకెళ్లారు. టిఆర్ఎస్ ప్లెక్సీలు ధ్వంసం చేసారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *