సిరాన్యూస్, చిగురుమామిడి
విద్యార్థులకు బెల్ట్స్ ,ఐడి కార్డులు అందజేత: మిలీనియం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని జిల్లా పరిషత్తు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 107 మంది విద్యార్థులకు మిలీనియం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్స్, ఐడి కార్డులు గ్రామ కార్యదర్శి గోదారి అజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. తమ వంతుగా విద్యార్థులకు సహాయాన్ని అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ ఫ్రాన్సిస్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గందే జ్యోతి చిరంజీవి, మిలీనియం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు తిప్పారపు సురేష్, జనరల్ సెక్రెటరీ చిప్ప తిరుపతి, ఉపాధ్యక్షుడు మారుపాటి మహిపాల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అప్పల రమేష్ కోశాధికారి లంకసిరి శ్రీనివాస్ సభ్యులు కొత్తపల్లి సునీల్ బండారి రవికుమార్ గణ గండ్రతి రాజు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.