ఐదేళ్లలో 500 కోట్లు సంపాదించిన మంత్రి అమర్ నాధ్

సిరా న్యూస్,అనకాపల్లి జిల్లా;
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు స్థానిక రైతు భారతిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ హజరయ్యారు. దాడి మాట్లడుతూ ఐదు సంవత్సరాలలో మంత్రి అమర్నాథ్ 500 కోట్లకు పైగా సంపాదించిన అవినీతిపరుడు. మంత్రి అమర్నాథ్ పీఏ వెంకట్ ఒక షాడో ఎమ్మెల్యేగా అధికారులను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డాడు. అనకాపల్లి బెల్లం మార్కెట్ స్థలాన్ని కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. కసింకోట ఆర్ఇసిఎస్ లో వందల కోట్ల కుంభకోణం చేశారు. ప్రభుత్వం ఏర్పడగానే ఆర్ ఇ సి ఎస్ ద్వారా రైతులకు నాణ్యమైన తక్కువ ధరకే విద్యుత్ అందిస్తాం. అనకాపల్లిలో వైసిపి గెలిస్తే మళ్లీ అమర్నాథ్ గ్యాంగ్ పరిపాలిస్తుంది. అమర్నాథ్ గ్యాంగ్ ద్వారా మరల అనకాపల్లి భూకబ్జాలకు నిలయంగా మారుతుంది. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ను చిత్తుగా ఓడించండి. మన అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే కొణతాల రామకృష్ణ ని, సీఎం రమేష్ ని గెలిపించుకోవాల్సిన అవస్థత ఉన్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *