సిరా న్యూస్,పల్నాడు;
సత్తెనపల్లిలోని మంత్రి అంబటి పార్టీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలుశుక్రవారం ముట్టడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శనకు దిగారు. మెగా డీఎస్సీ కాదు..దగా డీఎస్సీ. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ అని నినాదాలు చేసారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీలను జగన్ గాలికి వదిలేసారని అన్నారు. ఖాళీగా పోస్టులను భర్తీ చేయటానికీ జగన్ సిద్దమా ? బైబై జగన్ రెడ్డి, బైబై వైసీపీ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అక్కడికి చేరుకున్న వైకాపా కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను తోసేసారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలకు , కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.