సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో పలు రైళ్లు ఆపాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కి వినతి
పెద్దపల్లి జిల్లా ఓదెల హిందూ వాహిని ఆధ్వర్యంలో కేంద్ర హోo శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఓదెల ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెద్దపల్లి జిల్లాలోనే అతి పెద్ద దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ను చతీస్గడ్ , మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామి ని దర్శించుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థం ఓదెల రైల్వే స్టేషన్ లో కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే తిరుపతి ఎక్స్‌ప్రెస్, కాజీపేట నుండి అజ్ని నికి వెళ్లే అజ్ని ఎక్స్‌ప్రెస్ ను ఆపాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శాతాల కుమార్, రాచర్ల అశోక్, మెరుగు సారంగం .భారత్ గ్యాస్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.