సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న కొత్త రోగాలకు తగ్గట్టుగా నూతన వెర్షన్లను దృష్టిలో పెట్టుకొని కొత్త ఔషధాలు తయారు చేయడం, నివారణ మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్టల పాత్ర కీలకమైనదన్నారు. రక్త దానం తో పాటు అవయవ దానం పట్ల అవగాహన ను కల్పించేలా ఫార్మసీ కళాశాలలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఫార్మసీ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ వలీ ఉల్లాఖాన్, కార్యదర్శి జాఫర్ జావేద్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ అనుపమ కోనేరు, తెలంగాణ రెడ్ క్రాస్ చాప్టర్ చైర్మన్ అజయ్ మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.