సిరా న్యూస్,జగిత్యాల;
నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబ సమేతంగా ఉదయం స్వామి వారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ప్రభుత్వరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికి పూజల అనంతరం స్వామివార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్లను దర్శించుకోవడం గొప్ప భాగ్యం అని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు.