సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ ఫీవర్, డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారుల (DMHOs) తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు . వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు . అనంతరం జీవన్ దాన్ పై సమీక్ష నిర్వహించారు.