సిరా న్యూస్,విజయవాడ;
వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేసారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. – వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. – చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా. – ఇవాళ్టి జయహో బీసీ సభలోనే టీడీపీలో చేరతానని అన్నారు. – కర్నూలు ఎంపీగా వెళ్లాలని జగన్ అడిగారు. – కర్నూలు ఎంపీగా వెళ్లడం ఇష్టం లేదు. – జగన్ విధానాలతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని అన్నారు. జగన్ గుడిలో శిల్పం మాదిరిగా తయారయ్యారు.- తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. – సజ్జల, ధనుంజయరెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని అన్నారు.