సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా జడ్పీ సమావేశం హాట్ హాట్ గా కొనసాగుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో.. విత్తనాలు, ఎరువుల సమస్యలు సహా త్రాగునీరు, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇతర సమస్యల మీద చర్చ జరిగింది. జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ మీటింగ్ కు.. ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కలెక్టర్ నారాయణ రెడ్డి తో పాటు.. పలువురు ఎంఎల్ఏ లు, జడ్పీటీసీ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల లోనే మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని.. ఇక శివారు ప్రాంతాలు మిగతా గ్రామాల పరిస్థితి చెప్పనక్కర్లేదన్నారు. అప్పట్లో కాంట్రాక్టులు ప్రభుత్వంలో ఉన్నవారు అందన కాడికి దోచుకొని మిషన్ భగీరథను కమిషన్ భగీరథ గా మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
=======