సిరా న్యూస్,విశాఖపట్నం;
మంత్రి నారా లోకేష్ గురువారం నాడు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు లో మంత్రికి టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు నాయకులతో అయన ఫోటోలు దిగుతూ ముందుకు కదిలారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో టిడిపి జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు మంత్రి చేరుకున్నారు.